Naga Chaitanya: సామ్‌తో విడాకులు.. అదొక లెసన్
Hyderabad: టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ షాక్ ఇచ్చిన ఘటనల్లో నాగ చైతన్య(naga chaitanya), సమంత(samantha) విడాకులు ఒకటి. ఇప్పటికీ వారు విడిపోయారంటే ఫ్యాన్స్ నమ్మలేకపోతున్నారు. అయితే ఇప్పుడు ఎవరి దారి వారు చూసుకుని షూటింగ్ లైఫ్‌తో బిజీ అయిపోయారు. అయితే వారిద్దరూ విడిపోవడానికి కారణం మాత్రం ఎవ్వరికీ తెలీదు. వారిద్దరు కూడా ఒకరి గురించి ఒకరు మాట్లాడటానికి ఒప్పుకోవడంలేదు. అయితే నాగచైతన్య(naga chaitanya) కస్టడీ(custody) సినిమా వస్తున్న సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. సమంత(samantha)తో విడాకుల గురించి ప్రస్తావిస్తూ.. “మీకు జీవితంలో ఏమన్నా రిగ్రెట్స్ ఉన్నాయా?” అని అడగ్గా.. “రిగ్రెట్స్ ఏమీ లేవు బ్రో. అన్నీ లెసన్సే. వాటి నుంచే నేర్చుకుంటున్నాను. ఒకటి రెండు సినిమాల విషయంలోనూ నేను సరైన నిర్ణయం తీసుకోలేకపోయాను అలా అవి ఫ్లాప్ అయ్యాయి” అని తెలిపారు. వెంకట్ ప్రభు డైరెక్ట్ చేసిన ఈ సినిమా మే 12న రిలీజ్ అవ్వనుంది.