Naga Chaitanya: ధైర్యంగా ఉండు ర‌ష్మిక‌..!

Naga Chaitanya: రష్మిక మంద‌న‌కు (rashmika mandanna) సంబంధించిన డీప్ ఫేక్ (deep fake) వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. దీనిపై ఓ నెటిజ‌న్ స్పందించి వెంట‌నే యాక్ష‌న్ తీసుకోవాలంటూ కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోర‌గా.. కేంద్ర మంత్రి స్పందించి తొల‌గించాల‌ని ఆదేశాలు జారీ చేసారు. ఇలాంటి వీడియోలు చేసేవారిని క‌ఠినంగా శిక్షించాల‌ని బాలీవుడ్ న‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్ (amitabh bachchan) కూడా ట్వీట్ చేసారు. ఇప్పుడు నాగ చైత‌న్య కూడా ర‌ష్మిక‌కు మ‌ద్ద‌తుగా నిలిచారు.

“” టెక్నాల‌జీని ఇలా దుర్వినియోగం చేస్తున్నందుకు ఎంతో బాధ‌గా ఉంది. ఇది ఇలాగే కొన‌సాగితే భ‌విష్య‌త్తు ఎలా ఉంటుందో ఊహించ‌డానికే భ‌యంగా ఉంది. ఇలాంటి వీడియోలు చేసేవారిపై యాక్ష‌న్ తీసుకోవాలి. ఇలాంటి వీడియోలు సోష‌ల్ మీడియాలోకి రాకుండా రూల్స్ పెట్టాలి. ధైర్యంగా ఉండు ర‌ష్మిక “”  అని ట్వీట్ చేసారు.