Naga Chaitanya: పెళ్లి అలానే చేసుకోవాలని లేదుగా..!
Naga Chaitanya: త్వరలో నాగచైతన్య.. శోభిత ధూళిపాలల వివాహం ఘనంగా జరగనుంది. పెళ్లి రాజస్థాన్‌లో చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ అక్కడ పలు ఫైవ్ స్టార్ హోటల్స్ బుక్ అయ్యాయని టాక్. ఈ నేపథ్యంలో నాగచైతన్య తన పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. “” బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్ అంటే ఏంటి? పెళ్లి అలాగే చేసుకోవాలని లేదు కదా? నా ఉద్దేశంలో పెళ్లి అంటే నాకు ఎంతో ఇష్టమైనవారు నాకు దగ్గరి వారి మధ్య చేసుకునేది. కాకపోతే మనం మన పద్ధతులు, సంప్రదాయాలకు గౌరవం ఇస్తాం కాబట్టి అది గ్రాండ్‌గా కనిపిస్తుంది అంతే. పెళ్లి తేదీలు, వెన్యూ గురించి త్వరలో ప్రకటిస్తాం “” అని తెలిపారు.