Venu Swamy: నాగచైతన్య, శోభిత కచ్చితంగా విడిపోతారు
Venu Swamy: రాజకీయ నాయకులు, సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన జాతకాలు ఇక చెప్పను అని ప్రకటించిన ప్రముఖ జ్యోతిష్య నిపుణులు వేణుస్వామి మాట మార్చారు. నిన్న నాగచైతన్య, శోభిత ధూళిపాల నిశ్చితార్ధం జరిగిన నేపథ్యంలో వీరిద్దరి వైవాహిక జీవితంపై జాతకం చెప్పారు. 2027 నుంచి నాగచైతన్య, శోభితల మధ్య కష్టాలు, గొడవలు వస్తాయని.. వీరిద్దరూ విడిపోవడం ఖాయమని అంటున్నారు. వీరిద్దరికీ సంతానం కూడా కలగదని, ఎవరో ఒకరికి యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. శోభిత, నాగచైతన్యల మధ్య మరో స్త్రీ వల్ల వివాదాలు తలెత్తే సూచనలు వారి జాతకంలో కనిపిస్తున్నాయని చెప్పారు. వీరిద్దరి జాతకం కలవలేదని.. అవేమీ పట్టించుకోకుండా పెళ్లి చేసుకుంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.