Naga Chaitanya: నాగచైతన్య శోభిత నిశ్చితార్థం.. రేపే నాగార్జున ప్రకటన
Naga Chaitanya: నటుడు నాగ చైతన్య.. నటి శోభిత ధూళిపాల నిశ్చితార్థం ఈరోజు జరగనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇరు కుటుంబాల సమక్షంలో ప్రైవేట్‌గా ఈ నిశ్చితార్థ వేడుకను నిర్వహించనున్నారట. శుక్రవారం అక్కినేని నాగార్జున వీరి వివాహం గురించి ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. సమంతతో ఎనిమిదేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న నాగచైతన్య గోవాలో ఘనంగా వివాహం చేసుకున్నారు. నాలుగేళ్లు ఎంతో సంతోషంగ ఉన్నారు. ఆ తర్వాత ఉన్నట్టుండి ఏమైందో ఏమో.. తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. చాలా మంది పెళ్లి తర్వాత సమంత చేస్తున్న సినిమాలు నచ్చక చైతన్య విడాకులు ఇచ్చి ఉంటాడు అని కామెంట్స్ చేసారు.
కొన్ని నెలల క్రితం నాగచైతన్య శోభితతో కలిసి దిగిన ఫోటో బయటికి రావడంతో వీరి ప్రేమ విషయం బయటపడింది. సమంతతో పెళ్లయ్యాక నాగచైతన్య శోభితతో ఎఫైర్ పెట్టుకున్నాడని అందుకే సమంత విడిపోవాలని అనుకుందనే ప్రచారం కూడా జరిగింది. అయితే.. నాగచైతన్య, శోభిత మాత్రం తమ రిలేషన్‌షిప్ గురించి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు కానీ మాట దాటేస్తూ రావడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందన్న విషయంపై జనాలకు మరింత క్లారిటీ వచ్చేసింది.