Naga Chaitanya: ఆమిర్ కూతురి వెడ్డింగ్ రిసెప్షన్‌లో చై, శోభిత!
Naga Chaitanya: ఆమిర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్, నుపూర్ దంపతుల వెడ్డింగ్ రిసెప్షన్‌లో నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల (sobhita dhulipala) ఎంట్రీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని అందుకే చైతూ సామ్‌లు విడిపోయారని టాక్ వినిపిస్తూ వచ్చింది. ఇప్పుడు రిసెప్షన్‌కు వీరిద్దరూ వేరు వేరుగా వచ్చినప్పటికీ వెళ్లిపోయేటప్పుడు మాత్రం మీడియాకు కనిపించకుండా కలిసే వెళ్లిపోయారని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఆమిర్ ఖాన్, నాగచైతన్య కలిసి లాల్ సింగ్ చద్దాలో నటించిన సంగతి తెలిసిందే.