Naga Chaitanya: సామ్ ఉండగా ఎఫైర్.. వైరల్ అవుతున్న చై పాత వీడియో
Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాగచైతన్య, సమంత నాలుగేళ్ల వివాహ బంధం తర్వాత విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే చైతన్య శైలజా రెడ్డి అల్లుడు సినిమా చేస్తున్న సమయంలో వీరిద్దరూ కలిసే ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్ల సమయంలో నాగ చైతన్య, అను ఇమ్మాన్యుయెల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ సమయంలో యాంకర్ ఒక ప్రశ్న వేసారు.
మీ ఇద్దరిలో రిలేషన్షిప్లో ఉండి కూడా మరో వ్యక్తితో ఎఫైర్ పెట్టుకున్నారా? అని అడగ్గా.. ఇందుకు అను ఇమ్మాన్యుయెల్ నో అని చెప్పారు. కానీ నాగ చైతన్య యస్ అని చెప్పారు. దీనిపై అదే ఇంటర్వ్యూలో నాగ చైతన్య క్లారిటీ ఇచ్చారు. అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తుంటేనే జీవితాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలం అని.. ఇలాంటి వాటి వల్లే ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకుంటామని అన్నారు. ఆ వీడియోని సమంత, నాగచైతన్యల విడాకులకు లింక్ చేస్తూ చైతూనే మోసం చేసి ఉంటాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.