Mythri Movie Makers: చిన్న సినిమాలు కలిసి రావట్లేదా!?
Hyderabad: బ్లాక్ బస్టర్ సినిమాలతో అతి తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్న నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers). సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా వచ్చిన ‘శ్రీ మంతుడు’ సినిమాతో ఈ సంస్థ నిర్మాణ రంగంలో అడుగుపెట్టింది. ఆ తరువాత ఎన్టీఆర్(NTR) ‘జనతా గ్యారేజ్’, రామ్ చరణ్(Ram Charan) ‘రంగస్థలం’ వంటి సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్లు అందుకుని తిరుగులేని సంస్థగా ఎదిగింది. ఒకవైపు స్టార్ హీరోల సినిమాలు నిర్మిస్తూనే మరోవైపు చిన్న బడ్జెట్ సినిమాలనూ రూపొందిస్తోంది.
కానీ గత కొంతకాలంగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలుస్తున్నాయి. దీంతో నిర్మాతలకి భారీ నష్టాలు వాటిల్లుతున్నాయి. వాటిలో ముఖ్యంగా ‘హ్యాపీ బర్త్ డే’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘మీటర్’ వంటి సినిమాలు కనీసం ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయాయి. ఇందులో ఒక్క సినిమా కూడా కనీసం విడుదల ఖర్చులు కూడా వెనక్కి తీసుకురాలేకపోయింది.
దీంతో మైత్రి మూవీ మేకర్స్ వారికి భారీ నష్టాలు వాటిల్లాయి. ఈ సినిమాలను థియేటర్లలో విడుదల చేయడానికి మరింత డబ్బు ఖర్చు పెట్టినా మైత్రి మూవీ మేకర్స్ కొంత కూడా వెనకేసుకోలేకపోయింది. ఇక ఇటీవల విడుదలైన కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) నటించిన మీటర్(Meter) సినిమా కూడా నెగిటివ్ షేర్స్ తోనే రన్ అవుతుంది. దీంతో మైత్రి మూవీ మేకర్స్‌కి చిన్న సినిమాలు కలిసి రావడం లేదంటూ చర్చ జరుగుతోంది.