Salaar: ఫ్యాన్స్ గురించి ఆలోచించకుండా ఇలాంటి నిర్ణయమా?
Salaar: రెబెల్ స్టార్ ప్రభాస్ (prabhas) నటించిన సలార్ సినిమా శుక్రవారం రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా నైజాం రైట్స్‌ని మైత్రి మూవీ మేకర్స్ (mythri movie makers) సంస్థ రూ.70 కోట్లు ఇచ్చి కొనుగోలు చేసింది. అయితే కొన్ని సంవత్సరాలుగా ఏదన్నా సినిమా రిలీజ్ అవుతోందంటే టికెట్ కౌంటర్ల దగ్గర గంటలు గంటలు నిలబడి కొనుగోలు చేసేవారు బాగా తగ్గిపోయారు. బుక్ మై షో వంటి యాప్స్ రావడంతో అప్పటికప్పుడు ఆన్లైన్లో బుక్ చేసేసుకుంటున్నారు.
అలాంటిది సలార్ లాంటి సినిమా రిలీజ్ అవుతోందంటే ఇక ఫ్యాన్స్ ప్రీ బుకింగ్స్ చేసుకోకుండా ఉంటారా? ఈ సమయంలో ఆన్లైన్ బుకింగ్ ఉంటే ఈపాటికి యాప్ క్రాష్ అయ్యేది. కానీ మైత్రి మూవీ మేకర్స్ ఈ విషయంలో తీసుకున్న నిర్ణయం బాలేదు. సలార్‌కు ఏ రేంజ్లో బుకింగ్స్ ఉంటాయో తెలిసి కూడా ఆన్లైన్ బుకింగ్ ఆప్షన్ తీసేసి నేరుగా కౌంటర్ల నుంచి టికెట్ కొనుగోలు చేయాలని రూల్ పెట్టింది. దాంతో కౌంటర్ల దగ్గర ఫ్యాన్స్ క్యూ కట్టారు.
దాంతో రద్దీని కంట్రోల్ చేయలేక కౌంటర్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. వారిని అదుపు చేయలేక పోలీసులు ఒక్కొక్కర్ని పట్టుకుని లాఠీ చార్జ్ చేసారు. ఆన్లైన్ బుకింగ్‌తో పోయేదానికి ఇలా పోలీసుల చేత తన్నించుకునేలా నిర్ణయం తీసుకున్న మైత్రి మూవీ మేకర్స్ నిర్ణయం నిరుత్సాహ పరిచిందని ఫ్యాన్స్ వాపోతున్నారు.