Manchu Lakshmi: నా కుటుంబమే నాకు పెద్ద సమస్య
Manchu Lakshmi: హైదరాబాద్ నుంచి ముంబైకి మకాం మార్చారు ప్రముఖ నటి మంచు లక్ష్మి. అక్కడ సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రముఖ ఇంగ్లీష్ మీడియా ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె తనకు తన కుటుంబమే పెద్ద సమస్య అని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
“” నాకు నా కుటుంబమే పెద్ద సమస్య. నా కుటుంబం వల్లే నాకు సినిమాల్లో కెరీర్ లేకుండాపోయింది. సాధారణంగా టాలీవుడ్‌లో హీరో కూతుళ్లను సినిమాల్లోకి రానిచ్చేవారు కాదు. నేనూ ఆ కోవకు చెందినదాన్నే. నా తమ్ముళ్లు సినిమాల్లోకి వెళ్తానంటే నాన్న ఒప్పుకున్నారు. కానీ నా విషయంలో మాత్రం అడ్డుపడ్డారు. నా తమ్ముళ్లకు సులువుగా దొరికినవి నాకు కొట్లాడితే కానీ దొరకలేదు. దాంతో నేను కొన్నాళ్ల పాటు రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఉండేదాన్ని. ఆ తర్వాత నా స్నేహితుడు రానా దగ్గుబాటి హైదరాబాద్ నుంచి బయటికి వెళ్తే అవకాశాలు ఉంటాయని చెప్పాడు. అందుకే ముంబై వచ్చాను “” అని తెలిపారు.