Mrunal Thakur: అడ్రస్​ చెప్పండి ప్లీజ్​!

Hyderabad: హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన ‘సీతారామం’ (Sita Ramam) చిత్రంలో సీతగా నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన బాలీవుడ్​ భామ మృణాల్​ ఠాకూర్​ (Mrunal Thakur). మొదటి చిత్రంతోనే లక్షలమంది అభిమానుల్ని సొంతం చేసుకున్న మృణాల్​ వరుస అవకాశాలనూ అందుకుంటోంది. సక్సెస్‌, ఆఫర్లను దృష్టిలో పెట్టుకుని మృణాల్‌ హైదరాబాద్‌లోనే స్థిరపడాలని అందుకే ఇక్కడ లగ్జరీ ఇల్లు కొనుగోలు చేసిందని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇదే ప్రశ్నను నెటిజన్లు మృణాల్‌ను అడగగా తాజాగా ఆమె స్పందించారు. ఆ ఇల్లు ఎక్కడుందో చెబితే నేనూ వెళ్లి చూస్తానంటూ సరదాగానే కౌంటర్​ ఇచ్చారు.

మృణాల్​ తన ఫొటోలు, విశేషాలను షేర్​ చేస్తూ సోషల్​ మీడియాలో యాక్టివ్​గా ఉంటుంది. ఈ క్రమంలో ఓ నెటిజన్​ హైదరాబాద్​లో ఇల్లు గురించి ప్రశ్నించగా.. ‘నేను కొన్నాను అనుకుంటున్న ఇంటి అడ్రస్‌ చెప్తే నేను కూడా వచ్చి నా ఇంటిని చూసొస్తా. కొంచెం అడ్రస్​ చెప్పండి ప్లీజ్​.. ’ అంటూ ఫన్నీగా బదులిచ్చింది. ‘హైదరాబాద్‌ లాంటి చక్కని ప్రాంతంలో సెటిల్‌ అవ్వాలని ఎవరికి మాత్రం ఉండదు’ అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పటి వరకూ హైదరాబాద్‌లో ఇల్లు కొనకపోయినా భవిష్యత్తులో కొనే ఆలోచని ఉందని మృణాల్‌ తెలిపింది. సీతారామం తర్వాత నాని 30వ సినిమాలో నటిస్తోంది మృణాల్​.