Sohel: రీ రిలీజ్‌ల‌తో చిన్న సినిమాల‌ను చంపేయ‌కండి

బిగ్ బాస్ మాజీ విన్న‌ర్ సొహైల్ (sohel) రీరిలీజ్‌లపై త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు. ఆయ‌న యాక్ట్ చేసిన మిస్ట‌ర్ ప్రెగ్నెంట్ (mr pregnant) సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది. విభిన్న కాన్సెప్ట్‌తో రిలీజ్ అయిన ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా రీ రిలీజ్‌ల (re releases) ట్రెండ్‌పై ఆయ‌న స్పందించారు. రీ రిలీజ్‌లు సోమ, మంగళ, బుధ, గురువారాల్లో చేసుకుంటే బెట‌ర్ అని శుక్ర, శని, ఆదివారాల్లో చేయకండి అని రిక్వెస్ట్ చేసారు. ఈ రీ రిలీజ్‌లకి హైప్ ఇచ్చి చిన్న సినిమాలని చంపేయకండి అని ఆవేద‌న వ్య‌క్తం చేసారు.