Mithun Chakraborty: కాళ్లు చేతులు న‌రికేసి రోడ్డుపై వ‌దిలేయండి

Mithun Chakraborty: క‌ల‌క‌త్తా హత్యాచార ఘ‌ట‌న‌పై ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు మిథున్ చ‌క్ర‌వ‌ర్తి స్పందించారు. నిందితుడు సంజ‌య్ రాయ్‌ని అన‌వ‌స‌రంగా కోర్టుల చుట్టూ తిప్పుతున్నార‌ని.. దాని బ‌దులు అత‌ని కాళ్లు చేతులు న‌రికేసి రోడ్డుపై ప‌డేస్తే ప్ర‌జ‌లే వాడి సంగ‌తి చూసుకుంటార‌ని అన్నారు. కానీ మ‌నం ప్ర‌జాస్వామ్య దేశంలో బ‌తుకుతున్నాం కాబ‌ట్టి ఇలాంటి ప‌నులు చేయ‌లేమని.. ఆర్జీ క‌ర్ జూనియ‌ర్ వైద్యుల ఆందోళ‌న‌ను ప్ర‌భుత్వం ప‌ట్టించుకుని వారికి న్యాయం చేయాల‌ని అన్నారు.

క‌ల‌క‌త్తాలోని ఆర్జీ క‌ర్ మెడిక‌ల్ కాలేజ్‌లో జూనియ‌ర్ వైద్యురాలి ప‌ట్ల సంజ‌య్ రాయ్ అనే రాక్ష‌సుడు దారుణంగా అత్యాచారం చేసి చంపేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఇత‌ను ఇంకా జూడిషియ‌ల్ రిమాండ్‌లో ఉన్నాడు. కేసులో లోపాలు ఉన్నందున సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించిన వాద‌న‌లు జ‌రుగుతున్నాయి. నిందితుడికి ఉరి శిక్ష వేయాల‌ని వైద్యులు ఆందోళ‌న చేస్తున్నారు.