Mita Vashisht: ఆ తెలుగు దర్శకుడు 2 నెలలు తనతో గడపాలన్నాడు
Mita Vashisht: ఓ తెలుగు దర్శకుడు తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని అన్నారు బాలీవుడ్ నటి మీతా వశిష్ఠ్. ఆమె తెలుగు సినిమాల్లో ఎక్కడా నటించింది లేదు. తన కెరీర్ తొలినాళ్లలో ఓ తెలుగు సినిమా ఆడిషన్ కోసం దర్శకుడిని కలవడానికి వెళ్లారట. ఆ సమయంలో ఆ దర్శకుడు ఛాన్స్ ఇస్తానులే కానీ.. నాతో ఒక రెండు నెలలు గడుపు అన్నాడట. దాంతో మీతా షాకయ్యారు. నవ్వుతూనే అక్కడి నుంచి జంప్ అయిపోవాలనుకున్నారట. కానీ ఆ దర్శకుడు ఆమెను వెళ్లనివ్వకుండా తలుపు వేసేసాడట. మళ్లీ కలుస్తాను సర్ అని చెప్పి తాను ఎలాగోలా తప్పించుకుని వెళ్లిపోయానని మీతా తెలిపారు. ఇప్పుడు మీతా వయసు 56 ఏళ్లు. ఆమె 2000 సంవత్సరం సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమకు అవకాశాల కోసం వచ్చారు. సో.. ఆ సమయంలో ఉన్న దర్శకుల్లో ఇలా ప్రవర్తించినవారు ఎవరై ఉంటారా అనే చర్చ నడుస్తోంది.