Yash బ‌ర్త్‌డే రోజున విషాదం

Yash: క‌న్న‌డ న‌టుడు య‌ష్ పుట్టిన‌రోజున విషాదం చోటుచేసుకుంది. ఆయ‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ముగ్గురు ఫ్యాన్స్ ఫ్లెక్సీలు క‌డుతుండ‌గా క‌రెంట్ షాక్ త‌గిలి అక్క‌డికక్క‌డే చ‌నిపోయారు. మ‌రో ముగ్గురు ఫ్యాన్స్‌కి తీవ్రంగా గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న‌పై య‌ష్ ఇంకా స్పందించ‌లేదు. గ‌తంలో త‌మిళ న‌టుడు సూర్య పుట్టిన‌రోజున‌ ఇద్ద‌రు తెలుగు అభిమానులు ఫ్లెక్సీలు క‌డుతూ క‌రెంట్ షాక్‌కు గురై మ‌ర‌ణించారు. ఈ విష‌యం తెలుసుకున్న సూర్య వారి ఇంటికి వెళ్లి ఆర్ధిక సాయం ప్ర‌క‌టించారు. ఏద‌న్నా అవ‌స‌రం ఉంటే నిర్మొహ‌మాటంగా త‌న‌ను అడ‌గొచ్చ‌ని ధైర్యాన్ని ఇచ్చారు.