TG Venkatesh: త‌మ‌న్‌ని త‌మ‌న్నా చేసేసారు క‌ద‌రా..!

Hyderabad: BJP మంత్రి టీజీ వెంక‌టేష్ (tg venkatesh) న‌వ్వుల పాల‌య్యారు. నిన్న హైద‌రాబాద్‌లోని శిల్ప‌క‌ళా వేదిక‌లో బ్రో (bro) ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జ‌రిగింది. ఈవెంట్‌కి టీజీ వెంక‌టేష్ గెస్ట్‌గా వ‌చ్చారు. అంద‌రూ మాట్లాడేసిన త‌ర్వాత టీజీ వెంక‌టేష్ (tg venaktesh) కూడా నాలుగు ముక్క‌లు మాట్లాడితే బాగుంటుంది అనుకుని మైక్ తీసుకున్నారు. ఆయ‌న‌కు ఇచ్చి స్క్రిప్ట్ స‌రిగ్గా రాయ‌లేదేమో.. అన్నీ త‌ప్పులు చ‌దివేసారు. డైరెక్ట‌ర్ స‌ముద్ర‌ఖ‌నిని (samuthirankani) ప‌ట్టుకుని స‌ముద్ర‌వాల అని అన్నారు. ఆ త‌ర్వాత ప‌క్క‌నే ఉన్న సుమ‌.. స‌ముద్ర‌ఖ‌ని అని క‌రెక్ట్ చేసారు. ఆ త‌ర్వాత సాయి ధ‌ర‌మ్ తేజ్ (Sai dharam tej) గురించి మాట్లాడుతూ.. స‌హ హీరో ధ‌ర్మ తేజ అని అన్నారు. ఇక అన్నిటికంటే హైలైట్ ఏంటంటే.. మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్‌ని (thaman) త‌మ‌న్నా అనేసారు. ఇక హీరోయిన్ కేతిక శ‌ర్మ (ketika sharma) అయితే కీర్తి శ‌ర్మ అనేసారు. ఆయ‌న స్పీచ్ విని ఆడియ‌న్స్ న‌వ్వుకుంటూ ర‌చ్చ చేసారు.