నువ్వు నాతో ఇలాగే ఉండాలి.. అలా పోస్ట్ చేసి ఇలా డిలీట్
Hyderabad: కొంతకాలంగా మెగా డాటర్ నిహారికా కొణిదెల(Niharika Konidela) విడాకులు తీసుకోబోతున్నారన్న వార్త చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. దానికి తోడు నిహారిక, చైతన్య(Chaitanya Jonnalagadda) ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, పెళ్లి ఫొటోలు తీసేయడం, అంతగా సోషల్ మీడియాలో యాక్టివ్ లేకపోవడంతో ఈ వార్తలు నిజమే అంటూ ప్రచారం జరుగుతోంది. కాగా, నిహారికా తాజాగా చేసిన ఓ పోస్ట్ మళ్లీ ఈ వార్తలకు ఊతం పోసేలా చేసింది. ఒక వ్యక్తితో చనువుగా ఉన్న ఫొటోలు షేర్ చేస్తూ దానికి లవ్ అంటూ క్యాప్షన్ జతచేయడంతో మళ్లీ చర్చ మొదలైంది.
కొంతకాలంగా నిహారికపై దృష్టి పెట్టిన జనాలు ఆమెపై మళ్లీ ట్రోలింగ్ మొదలుపెట్టారు. అయితే తాజాగా తన ఇన్‌స్లా స్టోరీలో ఒక వ్యక్తితో క్లోజ్‌గా ఫొటో దిగి అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ‘నువ్వు నా జీవితంలో ముఖ్యమైనవాడివి. నువ్వు నాతో ఎప్పుడు ఇలాగే ఉండాలి. లాట్స్ ఆఫ్ లవ్’ అంటూ చెప్పుకొచ్చింది. ఇది చూసిన జనాలు ‘ నిహారిక కొత్త బాయ్ ఫ్రెండ్’ అంటూ కామెంట్స్ చేశారు. దీంతో వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చేసింది. డిలీట్ చేసిందంటే నిజమేనంటూ చర్చ మొదలైంది. ఇక, పెళ్లైన తర్వాత కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న నిహారిక ఇప్పుడు మాత్రం ఎక్స్పోజ్ చేస్తూ రకరకాల ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు. ఇటు రాజకీయాలు, అటు సినిమాల్లో ప్రతి విషయంపై స్పందించే నాగబాబు(Naga Babu) ఈ విషయంపై మాట్లాడకపోవడంతో మరిన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. మరి దీనిపై మెగా ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో చూడాలి.