Friends న‌టుడు మ్యాథ్యూ పెర్రీ క‌న్నుమూత‌

FRIENDS: ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టుడు, అమెరిక‌న్ రొమాంటిక్ కామెడీ సిరీస్ ఫ్రెండ్స్‌లో చాండ్ల‌ర్ బింగ్ (chandler bing) పాత్ర‌లో న‌టించిన మ్యాథ్యూ పెర్రీ (matthew perry) క‌న్నుమూసారు. ఆయ‌న వ‌య‌సు 54. నిన్న సాయంత్రం 4:30 గంట‌ల ప్రాంతంలో మ్యాథ్యూ లాస్ ఏంజెల్స్‌లోని త‌న‌ ఇంట్లో ఉన్న ఓ ట‌బ్‌లో ఆయ‌న మృత‌దేహం ల‌భించింద‌ట‌. హాట్ వాట‌ర్ ట‌బ్‌లో ఆయ‌న మునిగి చ‌నిపోయిన‌ట్లు అనుమానిస్తున్నారు. మ్యాథ్యూ మ‌రణంపై ఎలాంటి అనుమానాలు లేవ‌ని పోలీసులు తెలిపారు. కొన్నేళ్ల పాటు మ్యాథ్యూ పెయిన్ కిల్ల‌ర్స్, మ‌ద్యానికి అల‌వాటు ప‌డ్డాడ‌ని ఆ త‌ర్వాత కొంత‌కాలం పాటు రిహాబిలిటేష‌న్ సెంట‌ర్ల‌లలో ఉన్నాడ‌ని సన్నిహితులు చెప్తున్నారు. (matthew perry)