Ritesh Rana: డ్ర‌గ్స్ కేసులో పెద్ద పెద్ద “హేమా” హేమీలే దొరికిపోయారు

mathuvadalara 2 ritesh rana includes the word hema in drugs related dialogue

Ritesh Rana: ఓ విభిన్న కాన్సెప్ట్‌తో వ‌చ్చిన మ‌త్తువ‌ద‌ల‌రా సినిమా మంచి హిట్ అందుకుంది. దాంతో ద‌ర్శ‌కుడు రితేష్ రానా దానికి పార్ట్ 2 తీయాల‌నుకున్నారు. అలా మ‌త్తువ‌ద‌ల‌రా 2ను త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్నారు. నిన్న‌నే టీజ‌ర్ కూడా రిలీజ్ చేసారు. అయితే టీజ‌ర్‌లో ఓ డైలాగ్ హైలైట్ అవుతోంది. డ్ర‌గ్స్ విష‌యంలో పెద్ద పెద్ద హేమా హేమీలే దొరికిపోయారు అని. ఆ డైలాగ్ న‌టి హేమకు సంబంధించిందేనా అని రితేష్‌ను అడ‌గ్గా.. హేమ అరెస్ట్‌కి ముందే త‌మ సినిమా షూటింగ్ అయిపోయింద‌ని.. త‌మ సినిమాలో డైలాగ్‌కు హేమ కేసుకు ఎలాంటి సంబంధం లేద‌ని ఆయ‌న క్లారిటీ ఇచ్చారు. హేమా హేమీలు అంటే పెద్ద పెద్ద వారు అని అర్థ‌మ‌ని.. ఇలాంటి డౌట్లు వ‌స్తాయ‌నే స‌బ్‌టైటిల్స్ కూడా యాడ్ చేయించామ‌ని స్ప‌ష్టం చేసారు.