Mansoor Ali Khan: ఎట్టకేలకు త్రిషకు క్షమాపణలు చెప్పిన నటుడు
Mansoor Ali Khan: మొత్తానికి త్రిషపై (trisha) తప్పుడు వ్యాఖ్యలు చేసిన మన్సూర్ అలీ ఖాన్ ఆమెకు క్షమాపణలు చెప్పాడు. మన్సూర్‌పై తమిళనాడు డీజీపీ కేసు పెట్టడంతో ఆయన ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ బెయిల్‌ను మద్రాస్ హైకోర్టు తిరస్కరించింది. దాంతో అప్పటివరకు నేను చచ్చినా సారీ చెప్పను.. త్రిషపై పరువు నష్టం దావా వేస్తాను అని పట్టుబట్టి కూర్చున్న మన్సూర్ ఈరోజు క్షమాపణలు చెప్పారు. కళింగ యుద్ధం ముగిసింది.. ఇక త్రిష వివాహానికి నా నుంచి ఆశీస్సులు తీసుకుంటుందని భావిస్తున్నా అని మన్సూర్ ఆశా భావం వ్యక్తం చేసారు.