Mansoor Ali Khan: త్రిషపై తప్పుడు కూతలు.. సారీ చెప్పనంటున్న నటుడు
Mansoor Ali Khan: నటి త్రిషపై (trisha) అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ మన్సూర్ అలీ ఖాన్‌పై చిత్ర పరిశ్రమ మండిపడుతోంది. జాతీయ మహిళా కమిషన్ మన్సూర్‌పై యాక్షన్ తీసుకోవాలని కాంగ్రెస్ నేత, నటి ఖుష్బూ (kushboo) డిమాండ్ చేసారు. మరోవైపు లియో (leo) దర్శకుడు లోకేష్ కనగరాజ్ (lokesh kanagaraj) కూడా మన్సూర్ క్షమాపణలు చెప్పాలని అన్నారు.
ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.. మన్సూర్ ఓ ఇంటర్వ్యూలో ఎన్నో సినిమాల్లో విలన్‌గా నటించానని, హీరోయిన్లను రేప్ చేస్తున్న సీన్లలో నటించానని త్రిషతో కూడా అలా చేసే అవకాశం రావాలని అన్నాడు. దాంతో ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. నిన్న త్రిష ఈ ఘటనపై స్పందిస్తూ దేవుడి దయ వల్ల ఇలాంటి వ్యక్తితో ఇప్పటివరకు కలిసి నటించే అవకాశం రాలేదని.. మన్సూర్ ఎంత కోరుకున్నా కూడా తాను మాత్రం అసలు ఇలాంటి వ్యక్తితో కలిసి నటించబోనని తెలిపారు. ఇలాంటి వాళ్ల వల్లే మగజాతికి మచ్చ వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఇంత రచ్చ అవుతున్నా కూడా మన్సూర్ క్షమాపణలు మాత్రం కోరేందుకు సిద్ధంగా లేరు. రెండు పేజీల నోట్ రాసి ట్విటర్లో పోస్ట్ చేసారు అందులో తాను అన్న వ్యాఖ్యలను సమర్ధించుకున్నట్లే ఉన్నాయి కానీ ఎక్కడా కూడా క్షమాపణలు చెప్తానన్న మాటే లేదు. పైగా తాను ఏం తప్పుగా చెప్పానని అడుగుతున్నారు. తాను కేవలం సినిమాలో నటన గురించి అన్నానే తప్ప తప్పుడు ఉద్దేశంతో కాదని తెలిపారు. తన కూతురు కూడా త్రిష అభిమానేనని మీడియా వర్గాలు తన వ్యాఖ్యలను వక్రీకరించి రాసాయని నిందలు వేసారు. (mansoor ali khan)