Mansoor Ali Khan: త‌మ‌న్నాపై లియో న‌టుడి వివాదాస్ప‌ద‌ కామెంట్స్

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నాపై (tamanna) ప్ర‌ముఖ న‌టుడు మ‌న్సూర్ అలీ ఖాన్ (mansoor ali khan) వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసారు. సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ (rajinikanth) న‌టించిన జైల‌ర్ (jailer) సినిమాలో త‌మ‌న్నా కావాల‌య్యా (kavalayya song) పాట‌లో ఆడిపాడిన సంగ‌తి తెలిసిందే. ఈ పాట తెగ వైర‌ల్ అయింది. ముఖ్యంగా త‌మ‌న్నా స్టెప్పులు ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ద ట్రెండ్‌గా మారింది. చాలా మంది ఈ స్టెప్పుల‌తోనే రీల్స్ చేస్తున్నారు.

అయితే ఈ పాట‌పై మ‌న్సూర్ స్పందిస్తూ.. ఇలాంటి దరిద్ర‌మైన స్టెప్పులు త‌మ‌న్నా వేసిన‌ప్పుడు సెన్సార్ బోర్డు వాటికి ఎలా ఒప్పుకుంది అని మీడియా ముందు వ్యాఖ్యానించారు. మ‌న్సూర్ ఇలా ఎందుకు అన్నారంటే.. ఆయ‌న న‌టించిన కొత్త సినిమా స‌ర‌కులో (saraku) సెన్సార్ బోర్డు చాలా క‌ట్స్ ఇచ్చింద‌ట‌. మ‌రి త‌మ‌న్నా పాట‌లో అంత అశ్లీల‌త ఉంటే సెన్సార్ బోర్డు ఎలా ఒప్పుకుంది అని ప్ర‌శ్నించారు. మన్సూర్ వ్యాఖ్య‌ల‌ను త‌మ‌న్నా అభిమానులు ఖండించారు. సెన్సార్ బోర్డుతో స‌మ‌స్య‌లు ఉంటే దానికి త‌మ‌న్నా ఏం చేస్తుంద‌ని నిల‌దీసారు. వెంట‌నే త‌మ‌న్నాకు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నారు.