Mansoor Ali Khan: త్రిషపై తప్పుడు వ్యాఖ్యలు.. ముందస్తు బెయిల్ ఇవ్వని హైకోర్టు
Mansoor Ali Khan: తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ త్రిషపై (trisha) అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో అతనిపై తమిళనాడులో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో మన్సూర్ మద్రాస్ హైకోర్టులో ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా.. ఆ బెయిల్‌ను కోర్టు తిరస్కరించింది. ముందస్తు బెయిల్ పిటిషన్లో తప్పులు ఉన్నాయని దీనిని అనుమతించడం కుదరదని న్యాయమూర్తి తెలిపారు. దాంతో మన్సూర్ తరఫు న్యాయవాది మళ్లీ తప్పులు లేకుండా తాజా పిటిషన్ వేయనున్నారు.