Manoj Bajpayee: RGV నన్ను మోసం చేశారు!

Hyderabad: సినిమాలతోపాటు వెబ్​ సిరీస్​లతోనూ ప్రేక్షకులను అలరిస్తున్న బాలీవుడ్​ నటుడు మనోజ్​ బాజ్​పేయి(Manoj Bajpayee). హీరోగా, క్యారెక్టర్​ ఆర్టిస్ట్​గా ఎన్నో సినిమాలు చేసి అభిమానులను సంపాదించుకున్నారు. మంచి నటుడిగా గుర్తింపుతోపాటు పలు అవార్డులు అందుకున్న మనోజ్​ బాగా పాపులర్​ అయ్యింది మాత్రం రామ్​ గోపాల్​ వర్మ(RGV) సినిమాలతోనే. RGV హిందీలో తీసిన చాలా సినిమాల్లో మనోజ్ బాజ్‌పేయ్ కీలకపాత్రల్లో నటించారు.

తాజాగా మనోజ్ బాజ్‌పేయ్ RGV గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘దౌడ్ సినిమాలో ఓ నటుడి కోసం వెతుకుతున్నానంటే వెళ్లి మొదటిసారి RGVని కలిశాను. నేను బాండిట్ క్వీన్ లో మాన్ సింగ్ పాత్ర చేశాను అని చెప్పడంతో, ఇన్నాళ్లు నీ గురించే వెతుకుతున్నాను, ఆ సినిమా చాలా సార్లు చూశాను, ఆ పాత్ర నాకు బాగా నచ్చిందని. నీకు దౌడ్ సినిమాలో ఛాన్స్ వద్దు. నెక్స్ట్ నీ కోసమే ఓ స్క్రిప్ట్ రాశాను, అందులో నువ్వే మెయిన్ లీడ్ అని చెప్పారు. ఆ తర్వాత సత్య సినిమా కోసం కాల్ వస్తే మళ్ళీ వెళ్లి ఆర్జీవిని కలిశాను. కానీ అందులో రెండో పాత్ర కోసం నన్ను తీసుకుంటున్నాని చెప్తే నేను చాలా బాధపడ్డాను. నన్ను మెయిన్ లీడ్ అన్నారు కదా అని అడిగితే, భికూ మాత్రే పాత్ర గురించి నాకు చెప్పి ఓకే చెప్పేలా చేశారు. లీడ్ క్యారెక్టర్ లో ఎవరైనా చేయగలరు, కానీ భికూ మాత్రే నీకు మాత్రమే సాధ్యమవుతుంది అన్నారు. అప్పుడు మొదట బాధపడ్డా, సినిమా రిలీజ్ అయ్యాక భికూ మాత్రే పాత్రకు వచ్చిన స్పందన చూసి సంతోషం వేసింది’ అని చెప్పుకొచ్చారు.