Manchu Vishnu: జోక్ చేసా.. మీకే అర్థంకాలేదు..!

Hyderabad: ఇటీవ‌ల న‌టుడు మంచు విష్ణు(manchu vishnu) ఓ షాకింగ్ ఇమేజ్‌ను త‌న ట్విట‌ర్ హ్యాండిల్‌లో షేర్ చేసారు. ఆర్‌బీఐ(rbi) రూ.2000 నోట్ల‌ను విత్‌డ్రా చేసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించినప్పుడు రూ.2000 నోట్ల క‌ట్టలు కుప్ప‌లు తెప్ప‌లుగా ప‌డి ఉన్న ఫొటోను విష్ణు షేర్ చేసారు. పైగా అది క‌మెడియ‌న్ వెన్నెల కిషోర్(vennela kishore) ఇంట్లో చూసాన‌ని అన్నారు. అయితే ఆయ‌న ఏదో కామెడీగా ట్వీట్ చేస్తే.. కావాలని విష్ణు కిషోర్‌ని ఇరికించేందుకు అలా ట్వీట్ చేసార‌ని కొన్ని న్యూస్ వెబ్‌సైట్లు రాసాయ‌ట‌. ఈ విష‌యాన్ని విష్ణు ట్వీట్ చేసారు. “నేను కిషోర్ గురించి పెట్టిన ట్వీట్ జోక్. అది జోక్ అని తెలీక కొన్ని ఊరు పేరు తెలీని వెబ్‌సైట్లు వేరే ర‌కంగా రాసాయి. నేను కిషోర్ అప్పుడ‌ప్పుడు ఇలా జోకులు వేసుకుంటూ ఉంటాం. అది జోక్ అని అర్థంకాని వారిని ఆ దేవుడే కాపాడాలి” అని ట్వీట్ చేసారు.