Manchu manoj: ఏం మనసో.. మనోజ్, మౌనికల పెళ్లి వీడియో
Hyderabad: సినీ నటుడు మంచు మనోజ్(manchu manoj) తన పెళ్లి వీడియోను షేర్ చేసి ఫ్యాన్స్‌ని సర్ప్రైజ్ చేసారు. ఎంగేజ్మెంట్, సంగీత్, హల్దీ, పెళ్లి కూతుర్ని చేయడం, ఆ తర్వాత మూడు ముళ్ల బంధం.. ఇలా అన్నింటినీ మిక్స్ చేసి ఎంతో అందంగా చూపించారు. మనోజ్, మౌనికలకి ఇది రెండో వివాహం. దాంతో ఇద్దరికీ ఇది ఎంతో ఎమోషనల్ సమయం. పెళ్లి కూతుర్ని చేస్తున్నప్పుడు, పెళ్లి మండపంలో మనోజ్, మౌనికల కళ్లల్లో నీళ్లుతిరిగాయి. మౌనిక.. తన మామగారు మోహన్‌బాబు చెయ్యి పట్టుకుని థ్యాంక్యూ అని చెప్తున్నట్లు ఎమోషనల్ అయ్యారు. సంగీత్ వేడుకలో సాయిధరమ్ తేజ్, సిద్ధు జొన్నలగడ్డ కూడా సందడి చేసారు. ఈ వీడియోకు ప్రముఖ లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ చేత “ఏం మనసో” అనే పాటను రాయించారు. వీడియో చివర్లో మౌనిక తల్లిదండ్రులు పై నుంచి ఈ జంటను చూసి సంతోషిస్తున్నట్లు ఎంతో అందంగా చూపించారు. మనోజ్, మౌనిక, మౌనిక కుమారుడి చెయ్యి పట్టుకుని ఇది శివుడి ఆజ్ఞ అని చూపించడం ముచ్చటగా ఉంది.