Manchu Manoj: కూతురికి దేవ‌సేన అని పేరు పెట్టిన మ‌నోజ్

manchu manoj named his daughter as devasena

Manchu Manoj: ప్ర‌ముఖ న‌టుడు మంచు మ‌నోజ్ మౌనిక రెడ్డి దంప‌తులు కొన్ని నెల‌ల క్రితం పండంటి పాప‌కు జ‌న్మనిచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే నిన్న మంచు మ‌నోజ్ ఇంట్లో నామ‌క‌ర‌ణం, బార‌సాల కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా పాప‌కు దేవ‌సేన శోభ అని నామ‌క‌ర‌ణం చేసారు. సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి స‌తీమ‌ణి పేరు.. చ‌నిపోయిన త‌న అత్త‌గారి పేరు క‌లిసొచ్చేలా నామ‌క‌ర‌ణం చేసిన‌ట్లు మ‌నోజ్ తెలిపారు.