Manchu Lakshmi: వాడిని న‌డిరోడ్డు మీద న‌ర‌కండి

manchu lakshmi demands hanging punishment to praneet hanumanthu

Manchu Lakshmi:  తండ్రీ కూతుళ్ల సంబంధంపై అస‌భ్య‌క‌ర ప‌దాల‌తో జోకులు వేసిన యూట్యూబ‌ర్ ప్రణీత్ హ‌నుమంతుపై మండిప‌డ్డారు న‌టి మంచు ల‌క్ష్మి. ఇలాంటివాడిని న‌డిరోడ్డుపై న‌రికేయాల‌ని అప్పుడే ఇలాంటి మాట‌లు మాట్లాడాల‌న్న ఆలోచ‌న కూడా రాద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. యూట్యూబ్‌లో త‌న గురించి వీడియోలు వేసి థంబ్ నెయిల్స్ మాత్రం చాలా ఘోరంగా పెడుతున్నార‌ని అన్నారు. మంచు ల‌క్ష్మి చేయిచేసుకున్నారు అని థంబ్ నెయిల్ పెట్టార‌ని.. తీరా వీడియో చూస్తే తాను ఒక సినిమాకు క్లాప్ కొడుతున్న‌ట్లు ఉంద‌ని.. క్లాప్‌కి స్లాప్‌కి తేడా తెలీని వాళ్ల గురించి ఏం మాట్లాడగ‌లం అని అన్నారు. డ‌బ్బులు లేక ఎలా బ‌త‌కాలో తెలీక వాళ్లు ఇలాంటివి చేస్తున్నార‌ని.. అలాగ‌ని ఆ వీడియోల‌ను ఎంక‌రేజ్ చేయ‌లేమ‌ని చెప్పారు.