Vijay: విజ‌య్‌కాంత్‌కు నివాళులు అర్పించ‌డానికి వ‌స్తే చెప్పు విసిరిన వ్య‌క్తి

Vijay: త‌మిళ న‌టుడు ద‌ళ‌ప‌తి విజ‌య్‌కి చేదు అనుభ‌వం ఎదురైంది. కెప్టెన్ విజ‌య్‌కాంత్‌కు (captain vijaykanth) నివాళులు అర్పించేందుకు వ‌చ్చిన విజ‌య్‌పై గుర్తుతెలియ‌ని వ్య‌క్తి గుంపులో నుంచి విజ‌య్ పైకి చెప్పు విసిరాడు. కానీ విజ‌య్‌కు ఆ చెప్పు త‌గ‌ల్లేదు. వెంట‌నే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చెప్పు విసిరిన వ్య‌క్తి విజ‌య్‌కాంత్‌కు వీరాభిమాని అని తెలుస్తోంది.