Malavika Mohanan: సెక్స్ సీన్ల వెనకున్న సీక్రెట్ అదే

Malavika Mohanan reveals how hard it is to perform intimate scenes

Malavika Mohanan: సినిమాలో న‌టించాల‌ని రంగుల ప్ర‌పంచంలో బ‌త‌కాల‌ని చాలా మంది అనుకుంటారు. న‌టించ‌డం వ‌ర‌కు ఓకే. కానీ తెర‌పై ముద్దు స‌న్నివేశాలు సెక్స్ సీన్ల‌లో న‌టించాలంటేనే చాలా క‌ష్టం. అయితే న‌టీన‌టులు సెక్స్ సీన్ల‌లో న‌టించాల్సి వ‌స్తే ఈ చిన్న సీక్రెట్ టిప్‌ని ఫాలో అయిపోతే స‌రిపోతుంద‌ని అంటున్నారు మాళ‌విక మోహ‌న‌న్. తెలుగు, త‌మిళం సినిమాల్లో న‌టించి గుర్తింపు తెచ్చుకున్న మాళ‌విక ఇప్పుడు బాలీవుడ్‌లో పాగా వేసారు. సిద్ధాంత్ చ‌తుర్వేది (Siddhanth chaturvedi) అనే యువ హీరోతో క‌లిసి యుధ్రా (Yudhra) అనే సినిమాలో న‌టించారు. ఈ సినిమాలోని సాథియా అనే పాట ఇటీవ‌ల రిలీజ్ అయ్యింది. ఈ పాట‌లో సిద్ధాంత్ మాళ‌విక లిప్ కిస్సింగ్, ఘాటైన రొమాంటిక్ స‌న్నివేశాలు ఉన్నాయి.

ఈ స‌న్నివేశాల్లో తాను ఎలా న‌టించాలో వివ‌రించారు. ఇలాంటి సెక్స్ సీన్ల‌లో న‌టించాల్సి వ‌చ్చిన స‌మ‌యంలో ఇంటిమేట్ కోఆర్డినేట‌ర్ అనే వ్య‌క్తి సెట్స్‌లో ఉంటాడ‌ట‌. ఆ కోఆర్డినేట‌ర్ ద‌గ్గ‌రుండి ఇలా చేయండి అలా చేయండి అని ఆ సీన్లు సరిగ్గా వ‌చ్చేలా చూసుకుంటాడ‌ట‌. కానీ యుధ్రా షూటింగ్ స‌మ‌యంలో అలాంటి కోఆర్డినేట‌ర్ లేక‌పోవ‌డంతో చాలా క‌ష్ట‌ప‌డ్డాం అని వెల్ల‌డించారు. ఎముక‌లు కొరికే చలిలో ఓ బీచ్‌లో ఈ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించామ‌ని హీరోతో త‌న‌కు ఏర్ప‌డిన ఫ్రెండ్లీనెస్‌తో ఎలాంటి కోఆర్డినేట‌ర్ లేకుండానే తాను సీన్ల‌లో న‌టించాన‌ని తెలిపారు. స‌రైన డైరెక్ట‌ర్.. హీరోతో మంచి ఫ్రెండ్లీనెస్ ఉంటే ఇలాంటి ఇంటిమేట్ సీన్ల‌లో న‌టించ‌డం సులువు అవుతుంద‌ని తెలిపారు.