Malaika Arora: అర్జున్ కపూర్‌తో బ్రేకప్..?!
మలైకా అరోరా..(malaika arora) ఈమె ఎవరో తెలియనివారు తక్కువే ఉంటారు. ఎందుకంటే.. మలైకా బాలీవుడ్‌లో పెద్దగా సినిమాలు చేయకపోయినప్పటికీ ఎన్నో స్పెషల్ సాంగ్స్‌లో నటించింది. తెలుగులో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ (pawan kalyan) నటించిన గబ్బర్ సింగ్ (gabbar singh) సినిమాలో కెవ్వు కేక పాటలో ఆడిపాడింది. అయితే మలైకాకు సంబంధించి ఏ విషయమైనా వార్తల్లోకి ఎక్కింది అంటే అది ఆమె లవ్ స్టోరీకి సంబంధించిన అంశమే అయివుంటుంది.
బోనీ కపూర్ కొడుకు అర్జున్ కపూర్‌తో (arjun kapoor) మలైకా ఎప్పటినుంచో డేటింగ్‌లో ఉంది. మలైకా అర్జున్ కంటే వయసులో పదేళ్లు పెద్దది. అయితే ఇప్పుడు బాలీవుడ్‌లో వినిపిస్తున్న రూమర్ ఏంటంటే.. మలైకా అర్జున్ విడిపోయారట. కొంతకాలంగా అర్జున్ కుషా కపిల అనే ఆల్రెడీ పెళ్లై విడాకులు తీసుకున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మరోపక్క మలైకా అర్జున్ ఫ్యామిలీ మెంబర్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసింది కూడా. అర్జున్ కపూర్ తండ్రి బోనీ కపూర్, చెళ్లెళ్లు అన్షులా కపూర్, జాన్వి కపూర్, ఖుషి కపూర్‌లను అన్‌ఫాలో చేసేసింది. కానీ అర్జున్‌ని మాత్రం అన్‌ఫాలో చేయలేదు. అర్జున్‌తో కలిసి దిగిన ఫొటోలన్నీ అలాగే ఉన్నాయి. (malaika arora)
వీరిద్దరూ పెళ్లి చేసుకుని తీరతారు అని చాలా మంది అనుకున్నారు కానీ చివరికి ఇలా అయిపోయింది. మలైకా.. సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి అర్హాన్ ఖాన్ అనే టీనేజ్ కొడుకు కూడా ఉన్నాడు. కొంతకాలం క్రితం వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇందుకు కారణం అర్బాజ్‌కి విడాకులు ఇవ్వకుండానే మలైకా అర్జున్‌తో కలిసి తిరుగుతోందని వచ్చిన రూమర్సే. ఇక విడిపోయాక అర్బాజ్ ఫారిన్ అమ్మాయితో డేటింగ్‌లో ఉండగా.. మలైకా అర్జున్‌తో డేటింగ్‌లో ఉంది. మరి ఈ బ్రేకప్ రూమర్స్‌పై మలైకా స్పందిస్తుందో లేదో చూడాలి. (malaika arora)