Salaar: వాయిదా లేదు.. మేకర్స్​ క్లారిటీ!

Hyderabad: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న మరో భారీ ప్రాజెక్ట్‌ సలార్ (Salaar). ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బొగ్గు గనుల నేపథ్యంలో హై వోల్టేజీ యాక్షన్ ఎంటర్‌‌ టైనర్‌‌గా తెరకెక్కుతున్న సలార్ సినిమా సెప్టెంబర్‌‌ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తోంది.
అయితే, పలు కారణాల వల్ల సలార్ సినిమా విడుదల వాయిదా పడనుందని సోషల్ మీడియాలో పలు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. సలార్ సినిమా విడుదల వాయిదా పడిందని వచ్చే రూమర్లను నమ్మవద్దని, ముందుగా ప్రకటించిన తేదీనే సినిమా విడుదల కానుందని చిత్ర యూనిట్‌ వెల్లడించింది.
రూమర్లను నమ్మవద్దని కోరుతూ ట్విట్టర్‌‌లో ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రభాస్ అభిమానులకు సలార్ సినిమా తప్పకుండా గుర్తుండి పోతుందని పేర్కొంది. షూటింగ్ చివరిదశకు చేరకున్న సలార్ సినిమాలో శృతిహాసన్ (Shruti Haasan), పృధ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు ఇతక కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
కాగా, ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ (Adipurush).. జూన్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో సీత క్యారెక్టర్‌‌లో కృతి సనన్ (Kriti Sanon), రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan), హనుమంతుడిగా సన్నీ సింగ్ నటించారు. ఈ సినిమాలతోపాటు ప్రభాస్‌ నటిస్తున్న మరో భారీ బడ్జెట్ సినిమా ప్రాజెక్ట్‌ కె. ఈ సినిమాలో బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కీలకపాత్ర పోషిస్తుండగా.. ప్రభాస్‌ కు జోడీగా దీపికా పదుకొణె (Deepika Padukone) నటిస్తోంది.