Makarand Deshpande: RRR స‌మ‌యంలో చ‌ర‌ణ్ నా కోసం వ‌చ్చారు

Makarand Deshpande:  ఎస్ఎస్ రాజ‌మౌళి ప్ర‌తిష్ఠాత్మకంగా తెర‌కెక్కించిన RRR సినిమాలో త‌నకు సంబంధించిన స‌న్నివేశాలు చాలా మ‌టుకు డిలీట్ అయ్యాయని అన్నారు ప్ర‌ముఖ న‌టుడు మ‌క‌రంద్ దేశ్‌పాండే. త‌న జుట్టే త‌న‌ను ఎంతో ఫేమ‌స్ చేసింద‌ని కానీ RRR సినిమా షూటింగ్ సెట్స్‌కి త‌న‌ను రాజ‌మౌళి ర‌మ్మ‌న్న‌ప్పుడు తాను వేరే సినిమా షూటింగ్‌లో ఉన్నాన‌ని.. ఆ సినిమా కోసం జుట్టు క‌ట్ చేసుకున్నాన‌ని తెలిపారు.

ఇదే మాట రాజ‌మౌళికి చెప్తే మేక‌ప్ వేసి జుట్టు పెట్టేద్దామ‌ని అన్నార‌ని పేర్కొన్నారు. మ‌ధ్య‌లో క‌రోనా రావడంతో సినిమా ప‌లుమార్లు వాయిదా ప‌డింద‌ని.. దాంతో తాను న‌టించిన చాలా మ‌టుకు స‌న్నివేశాల‌ను క‌ట్ చేసార‌ని తెలిపారు. RRR సెట్స్‌లో తానున్నానని తెలీగానే.. స‌త్య సినిమాలో త‌న యాక్టింగ్‌కి ఫ్యాన్ అయిన రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) త‌న‌ను చూసేందుకే సెట్స్‌కి వ‌చ్చార‌ని ఎంతో ఆప్యాయంగా ప‌ల‌క‌రించిన‌ట్లు తెలిపారు.