Mahesh Babu: పాకిస్థాన్‌లో టాప్‌ 10లో సూప‌ర్‌స్టార్..!

Mahesh Babu: సూప‌ర్‌స్టార్ మహేష్ బాబు.. పాకిస్థాన్ ట్రెండ్స్‌లో టాప్ 10లో ట్రెండ్ అవుతున్నారు. ఇందుకు కార‌ణం ఆయ‌న తీసిన గుంటూరు కారం (Guntur Kaaram) సినిమానే. ఈ సినిమా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వ‌ద్ద రూ.100 కోట్లు రాబ‌ట్టింది. ఈ సినిమా తెలుగువారికే కాదు పాకిస్థానీయుల‌కు కూడా తెగ న‌చ్చేసిన‌ట్లుంది. పాకిస్థాన్ ట్విట‌ర్ ట్రెండ్స్‌లో టాప్ 10లో గుంటూరు కారం ట్రెండ్ అవ్వ‌డం వైర‌ల్‌గా మారింది. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తెర‌కెక్కించిన గుంటూరు కారం సినిమా నెట్‌ఫ్లిక్స్‌లోనూ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. హిందీ వెర్ష‌న్‌.. ప్ర‌భాస్ న‌టించిన స‌లార్‌ను బీట్ చేసేసింది. ఇప్ప‌టికీ నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 10 ఇండియ‌న్ సినిమాల్లో స్థానం ద‌క్కించుకుంటోంది.

ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు.. ద‌ర్శ‌క‌ధీరుడ ఎస్.ఎస్ రాజ‌మౌళి తీస్తున్న సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమాను ప్ర‌స్తుతం SSMB29 అని పిలుస్తున్నారు. ఈ సినిమాలో మ‌హేష్ దాదాపు 8 కొత్త లుక్స్‌లో క‌నిపించ‌నున్నారు. భారీ అంచ‌నాల మ‌ధ్య ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు జ‌క్క‌న్న‌. మ‌హేష్ త‌న లుక్ రివీల్ అవ్వ‌కుండా కొంత‌కాలం పాటు మీడియాకు క‌నిపించ‌రని తెలుస్తోంది.