Bigg Boss: బిగ్‌బాస్ షోలో మహేష్ బాబు మరదలి ఆకలి కేకలు
Bigg Boss: సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 18వ సీజన్లో సూపర్‌స్టార్ మహేష్ బాబు మరదలు శిల్పా శిరోద్కర్ పాల్గొన్నారు. మహేష్ భార్య నమ్రత సొంత చెల్లెలే శిల్పా. ఈ వారం బిగ్ బాస్ షోలో భాగంగా అవినాష్ మిశ్రా అనే వ్యక్తి విలన్‌గా మారి శిల్పాకు తిండి లేకుండా చేస్తున్నాడు. అవినాష్‌కు బిగ్‌బాస్‌లోని ఇతర కంటెస్టెంట్లకు రేషన్ బియ్యం, సరుకులు ఇచ్చే పని అప్పగించారు. ఈ నేపథ్యంలో శిల్పా అవినాష్‌కు ఓ ప్రశ్న వేసింది. మాంసాహారం తినేవారికి మాంసాహారం పెడతావా? అని అడిగారు. ఇందుకు అవినాష్ స్పందిస్తూ.. నేను మాంసాహారం ఇవ్వను. సాధారణ రేషన్ వస్తువులు ఇస్తాను. అయినా నువ్వు వెజ్ తింటూ నాన్ వెజ్ ఎందుకు అడుగుతున్నావ్ అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్న శిల్పాను ఆగ్రహానికి గురిచేసింది. నేను ఏం తినాలో నువ్వు నిర్ణయించాల్సిన అవసరం లేదు అని సమాధానం ఇచ్చింది.
శిల్ప ప్రవర్తనపై అవినాష్ స్పందిస్తూ.. నువ్వు నాతో ఎలా ప్రవర్తిస్తావో నా ఆలోచనల్లో అలా ఉంటావు. నువ్వు సరిగ్గా మాట్లాడకపోతే నా దృష్టిలో చెడ్డదానిగా ఉంటావ్ అన్నాడు. దీనికి శిల్పా స్పందిస్తూ.. నేను నీ దృష్టిలో మంచిదానిలా ఉండటానికి ఈ షోకి రాలేదు. నీ చేత్తో నాకు ఏమీ వద్దు. నేను పస్తున ఉంటాను. ట్యాబ్లెట్స్ వేసుకుని నీ ముందే ఆకలితో చచ్చిపోతాను అని వారించింది. అలా శిల్పా టాస్క్‌లో భాగంగా బిగ్ బాస్ షోలో ఆకలితో అలమటిస్తోంది.