Mahesh Babu: నీ దూకుడు.. సాటెవ్వ‌డు…!

Hyderabad: సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు (mahesh babu) జిమ్‌లో తెగ వ‌ర్క‌వుట్స్ చేసేస్తున్నారు. ఆయ‌న వర్క‌వుట్స్ చేస్తున్న‌ప్పుడు ట్రైన‌ర్ తీసిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ ప్లానింగ్ అంతా ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్ రాజ‌మౌళి (rajamouli) సినిమా కోస‌మేన‌ని టాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. అడ్వెంచ‌ర‌ర్ క్యారెక్ట‌ర్‌లో మ‌హేష్ బాబు క‌నిపించ‌బోతున్నార‌ని రాజ‌మౌళి అనౌన్స్ చేసిన‌ప్పుడే ఇందులో మ‌హేష్ లుక్ స‌ర్‌ప్రైజింగ్‌గా ఉండ‌బోతోంద‌ని గెస్ చేసేసారు ఫ్యాన్స్. మ‌రోప‌క్క మహేష్.. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న గుంటూరు కారం (guntur kaaram) సినిమాలో న‌టిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే (pooja hegde) హీరోయిన్‌గా న‌టించాల్సి ఉంది కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆమెను తీసేసారు. ఆమె స్థానంలో మీనాక్షి చౌద‌రి (meenakshi chowdhary) న‌టిస్తున్న‌ట్లు తెలుస్తోంది. హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల (sreeleela) సెకండ్ హీరోయిన్ రోల్ చేస్తోంది.