Anupama Parameshwaran: మ‌హేష్ బాబుపై కామెంట్సా?

Anupama Parameshwaran: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఇంట‌ర్వ్యూ ఒక‌టి సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఆమె సినిమాల‌కు రాని ప‌బ్లిసిటీ ఆ ఒక్క ఇంట‌ర్వ్యూకి వ‌స్తోంది. ఇందుకు కార‌ణం ఏంటంటే.. అనుప‌మ టాలీవుడ్ సూప‌ర్ స్టార్ అయిన మ‌హేష్ బాబుని (Mahesh Babu) ట్రోల్ చేయ‌డ‌మే అని తెలుస్తోంది. అనుప‌మ మ‌హేష్ బాబుని ట్రోల్ చేయ‌డం ఏంటి? అంత ధైర్యం ఉందా? అనుకుంటున్నారా? అయితే మీకు మ్యాట‌ర్ తెలియాల్సిందే.

అనుప‌మ హీరోయిన్‌గా న‌టించిన టిల్లు స్వ్కేర్ (Tillu Square) సినిమా త్వ‌ర‌లో రిలీజ్ కాబోతోంది. అయితే అనుప‌మ న‌టించిన గ‌త సినిమాల‌తో పోలిస్తే టిల్లు స్వ్కేర్‌లో పూర్తిగా లుక్స్ మార్చేసింది. రౌడీ బాయ్స్ సినిమాలో లిప్ కిస్సుల‌తో అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచిన అనుప‌మ టిల్లు స్వ్కేర్‌లో గ్లామ‌ర్ డోస్ పెంచేసింది. ఒక‌ప్పుడు సంప్ర‌దాయంగా క‌నిపించే పాత్ర‌ల‌ను మాత్ర‌మే చేసిన అనుప‌మ ఇప్పుడు ఎందుకు ఇలాంటి గ్లామ‌ర‌స్ రోల్స్ చేస్తోంది అనే డౌట్ అంద‌రికీ వ‌చ్చింది.

దీనిపై అనుప‌మ స్పందిస్తూ.. త‌న‌కు వ‌ర్స‌టైల్ రోల్స్‌లో న‌టించాల‌ని ఉంద‌ని.. త‌న వికీపీడియాలోని ఫోటోల‌ను చూస్తే ఈ ఫోటో ఫ‌లానా సినిమాలోది అని ఆడియ‌న్స్ గుర్తుప‌ట్టే విధంగా ఉండాలి కానీ ఎప్పుడూ ఒకే ర‌క‌మైన పాత్ర‌ల్లో న‌టించి ఏ పాత్ర ఏ సినిమాలోదో చెప్ప‌లేని విధంగా ఉండ‌కూడ‌ద‌నే ఇలాంటి రోల్స్ ఎంచుకుంటున్నాన‌ని అన్నారు. అయితే అనుప‌మ మాట‌ల్లో ఎక్క‌డా కూడా మ‌హేష్ బాబు పేరు రాలేదు. కానీ సోష‌ల్ మీడియాలో మాత్రం ఆమె మ‌హేష్ బాబుని, సాయి ప‌ల్లవిని (Sai pallavi) ట్రోల్ చేసారంటూ కామెంట్స్ స్టార్ట్ చేసారు. దాంతో మ‌హేష్ బాబు, సాయి ప‌ల్ల‌వి ఫ్యాన్స్ ట్రిగ్గ‌ర్ అయ్యి అనుప‌మను ట్రోల్ చేయ‌డం మొద‌లుపెట్టారు.

గ‌త తొమ్మిది సినిమాల్లోనూ మ‌హేష్ ఒకే లుక్‌తో కనిపిస్తున్నార‌ని.. ఆయ‌న ఒక సినిమా సెట్ నుంచి మ‌రో సినిమా సెట్‌కి వెళ్తే అస‌లు లుక్‌లో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవ‌స‌రం రావ‌డంలేద‌నే టాక్ ఉంది. ఇది సాయి ప‌ల్ల‌వి విష‌యంలోనూ అంతే. సాయి ప‌ల్ల‌వి చేసే పాత్ర‌ల‌న్నీ ఆల్మోస్ట్ ఒకేటా ఉంటాయి. ఆమె నుంచి ఎలాంటి కొత్త‌ద‌నం క‌నిపించ‌డంలేదు. కాక‌పోతే ఎలాంటి ఎక్స్‌పోజింగ్, గ్లామ‌ర్ పాత్ర‌ల్లో న‌టించ‌డం లేదు అనే అంశం ప‌ల్ల‌వికి ప్ల‌స్ పాయింట్‌గా మారింది.