Nag Ashwin: కృష్ణుడిగా మ‌హేష్ సూట‌వ్వ‌డు

Nag Ashwin

 

Nag Ashwin:  క‌ల్కి 2898 ఏడి సినిమాలో కృష్ణుడి పాత్ర‌లో మ‌హేష్ బాబు న‌టించి ఉంటే చాలా బాగుండేద‌ని చాలా మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే కృష్ణుడి పాత్ర‌లో త‌మిళ న‌టుడు కృష్ణ‌కుమార్ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్య‌న్ న‌టించాడు. అత‌న్ని చూపించ‌లేదు కానీ న‌టించింది కృష్ణ‌కుమార్ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్య‌న్ అని వెల్ల‌డించారు.అయితే మ‌హేష్ బాబుని తీసుకుని ఉంటే బాగుండేద‌ని మీడియా ప్ర‌తినిధులు నాగ్ అశ్విన్‌ని కోర‌గా.. కృష్ణుడి పాత్ర‌కు వేరే సినిమాలో మ‌హేష్ సూట‌వుతాడు కానీ.. క‌ల్కిలో ఆయ‌న కృష్ణుడిగా సూట‌వ్వ‌డ‌ని తెలిపారు.

ఇక పార్ట్ 2లో ప్ర‌భాస్ డామినేష‌న్‌తో పాటు ఫ‌న్ ఇంకా ఎక్కువ ఉంటుంద‌ని అన్నారు. ఇక విజ‌య్ దేవ‌ర‌కొండ గురించి చెప్తూ.. విజ‌య్ త‌నకు ల‌క్కీ చార్మ్ లాంటివాడ‌ని.. అందుకే త‌న ప్ర‌తి సినిమాలో విజ‌య్‌కి అవ‌కాశం ఇస్తాన‌ని అన్నారు. విజ‌య్ లీడ్ రోల్ అయితే బాగుంటుంద‌ని.. ఒక‌వేళ కుద‌ర‌క‌పోయినా ఏదో ఒక పాత్ర‌ను ఆయ‌న కోసం క్రియేట్ చేస్తాన‌ని వెల్ల‌డించారు.