SSMB28: అదిరిపోయే టైటిల్​ ఫిక్స్​ చేసిన మహేష్!

Hyderabad: టాలీవుడ్​ సూపర్​స్టార్​ మహేష్​ బాబు(Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Trivikram)​ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. SSMB28 వర్కింగ్​ టైటిల్​తో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్​ కానుంది. కాగా, ఈ సినిమా టైటిల్​ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. తాజాగా ఈ సినిమా టైటిల్​ ప్రకటించేశారు మేకర్స్​.

అంతా అనుకున్నట్లుగానే ‘గుంటూరు కారం’ టైటిల్​ని ఫిక్స్​ చేస్తూ పోస్టర్​ రిలీజ్​ చేశారు మేకర్స్​. సూపర్​స్టార్​ కృష్ణ జయంతి సందర్భంగా మోసగాళ్లకు మోసగాడు రీరిలీజ్​ ప్రదర్శనలో ఈ టైటిల్​ని అనౌన్స్​ చేసి అభిమానులకు అదిరిపోయే ట్రీట్​ ఇచ్చారు. ఉగాది సందర్భంగా రిలీజ్​ చేసిన ఫస్ట్​లుక్​తో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో మహేష్​ మాస్​లుక్​లో అదరగొట్టబోతున్నాడని తెలుస్తోంది. చేతిలో బీడి, తలకు ఎర్రకండువాతో ఇటీవల విడుదల చేసిన పోస్టర్​ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కోసం చాలా టైటిల్స్​ని పరిశీలించినా ‘గుంటూరు కారం’ టైటిల్​కే మొగ్గు చూపారట మహేష్​. ఇక, ఈ సినిమాలో మహేష్​కి జోడిగా పూజా హెగ్డే, శ్రీలీల నటిస్తున్నారు.