SSMB28: అదిరిపోయే అప్​డేట్​ ఇచ్చిన మేకర్స్​!

Hyderabad: టాలీవుడ్​ సూపర్​స్టార్​ మహేష్​ బాబు(Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Trivikram)​ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. SSMB28 వర్కింగ్​ టైటిల్​తో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్​ కానుంది. కాగా, ఈ సినిమా టైటిల్​ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. కాగా, ఈ సినిమాపై అదిరిపోయే అప్​డేట్​ ఇచ్చారు మేకర్స్​. అంతా అనుకున్నట్లుగానే ఈ సినిమా టైటిల్​ను మే 31న అనౌన్స్​ చేయనున్నట్లు ప్రకటించారు.

ఉగాది సందర్భంగా రిలీజ్​ చేసిన ఫస్ట్​లుక్​తో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో మహేష్​ మాస్​లుక్​లో అదరగొట్టబోతున్నాడని తెలుస్తోంది. చేతిలో బీడి, తలకు ఎర్రకండువాతో ఇటీవల విడుదల చేసిన పోస్టర్​ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ‘SSMBMassStrike in just 2 days’ అంటూ పోస్టర్​ రిలీజ్​ చేశారు మేకర్స్​. ఈ సినిమా టైటిల్​గా అమరావతికి అటు ఇటు, ఊరికి మొనగాడు, గుంటూరు కారం.. వంటి చాలా పేర్లు వినిపిస్తున్నాయి.  ఇక, ఈ సినిమాలో మహేష్​కి జోడిగా పూజా హెగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. మే 31న కృష్ణ జయంతి సందర్భంగా మహేష్​ సినిమాలకు సంబంధించిన మరిన్ని అప్​డేట్స్​ వస్తాయని ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఈ సందర్భంగా కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాడు సినిమాను రీ రిలీజ్​ చేస్తున్న సంగతి తెలిసిందే.