KS Ravikumar: ర‌జినీకాంత్ వ‌ల్లే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది

lingaa flopped because of rajinikanth says ks ravikumar

KS Ravikumar: సినీ ఇండస్ట్రీలో ఒక స్థాయికి ఎదిగాక కొన్ని సార్లు హీరోల నిర్ణ‌యాల‌కే ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు క‌ట్టుబ‌డి ఉండాల్సి వ‌స్తుంది. దీని వ‌ల్ల సినిమా హిట్ అవ్వ‌చ్చు.. ఫ్లాప్ అవ్వ‌చ్చు. చాలా సందర్భాల్లో సినిమాలు తీసే విష‌యంలో హీరోలు ఇన్‌వాల్వ్ అయితే ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది. ఈ అనుభ‌వం ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కేఎస్ ర‌వికుమార్‌కి సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ వ‌ల్ల ఎదురైంద‌ట‌. కేఎస్ ర‌వికుమార్, ర‌జినీకాంత్ కాంబినేష‌న్‌లో న‌ర‌సింహ‌, లింగా సినిమాలు వ‌చ్చాయి. న‌ర‌సింహ సినిమా ఇప్ప‌టికీ ట్రెండ్ సెట్ట‌రే. ఇక లింగా మాత్రం అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యింది.

అయితే లింగా ఫ్లాప్ అవ్వ‌డానికి కార‌ణం ర‌జినీకాంతే అని షాకింగ్ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు ర‌వికుమార్. సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌లో ర‌జినీ క‌ల‌గ‌జేసుకోవ‌డం వ‌ల్లే ఫ్లాప్ అయ్యింద‌ని అంటున్నారు. అస‌లు సినిమాకు సంబంధించిన CGI స‌రిగ్గా పూర్తి చేయ‌నివ్వ‌లేద‌ని.. సెకండాఫ్ మొత్తం మార్చేసార‌ని అన్నారు. చివ‌ర్లో స‌ర్‌ప్రైజ్ క్లైమాక్స్ ట్విస్ట్‌ని, అనుష్క శెట్టి చేసిన పాట‌ను కూడా లేపేయ‌డంతో సినిమా డిజాస్ట‌ర్‌గా మారిందని అన్నారు.