Lavanya Tripathi: లావ‌ణ్య త్రిపాఠి వ‌ర్సెస్ మెగా కోడ‌లు

Lavanya Tripathi: వ‌రుణ్ తేజ్‌ని (varun tej) పెళ్లి చేసుకుని మెగా ఇంటి కోడ‌లు అయిపోయారు లావ‌ణ్య త్రిపాఠి. చాలా మంది పెళ్లి త‌ర్వాత ఆమె సినిమాలు మానేస్తార‌ని అనుకున్నారు. కానీ మిస్ ప‌ర్‌ఫెక్ట్ (miss perfect) అనే సినిమాతో మ‌ళ్లీ ఫ్యాన్స్‌ను అల‌రించేందుకు వ‌స్తున్నారు లావ‌ణ్య‌. ఈ నేప‌థ్యంలో లావ‌ణ్య ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్‌పై స్పందించారు.

ఇప్పుడు అంద‌రూ లావ‌ణ్య‌ను లావ‌ణ్య త్రిపాఠి కొణిదెల అని సంబోధిస్తున్నారు. లావ‌ణ్య త్రిపాఠి పేరు న‌చ్చిందా.. లేక మెగా కోడ‌లు అనే పిలుపు న‌చ్చిందా అనే అంశంపై లావ‌ణ్య స్పందించారు. లావ‌ణ్య త్రిపాఠి అనే పేరును తాను సొంతంగా సంపాదించుకున్నానని.. ఇప్పుడు మెగా కోడ‌లు అనే పేరు ఇక ముందు కూడా ఎంతో స్పెష‌ల్‌గా ఉండ‌బోతోంద‌ని అన్నారు. అయితే తాను క‌ష్ట‌ప‌డి సంపాదించుకున్న లావ‌ణ్య త్రిపాఠి అనే పేరే త‌న‌కు ఎప్పుడూ స్పెష‌ల్ అని తెలిపారు.

పెళ్లికి ముందు కానీ త‌ర్వాత కానీ సినిమాలు చేయొద్ద‌ని కానీ ఫ‌లానా పాత్ర‌లకు ఒప్పుకోవ‌ద్దు అని కానీ ఎవ్వ‌రూ కూడా ఎలాంటి నియ‌మాలు పెట్ట‌లేద‌ని త‌న త‌ల్లిదండ్రులు కూడా రూల్స్ ఏమీ పెట్ట‌లేద‌ని లావ‌ణ్య తెలిపారు. ఇక త్వ‌ర‌లో లావ‌ణ్య‌, వ‌రుణ్‌లు క‌లిసి ఏద‌న్నా సినిమాలో న‌టించ‌బోతున్నారా అనే అంశంపై స్పందిస్తూ మంచి స్క్రిప్ట్ దొరికితే త‌ప్ప‌కుండా న‌టిస్తామ‌ని పేర్కొన్నారు లావ‌ణ్య‌.