Lavanya Tripathi: వరుణ్ తేజ్ పుట్టిందే భర్త అవ్వడానికి..!
Hyderabad: ఆవిడ ఎప్పుడో చెప్పిందిరా.. చాలా సేపు సస్పెన్స్ తర్వాత మనకు అర్థమైంది అన్నట్టు.. వరుణ్ తేజ్ (varun tej) అంటే తనకు ఎంత ఇష్టమో ఎప్పుడో బయటపెట్టింది నటి లావణ్య త్రిపాఠి (lavanya tripathi). వరుణ్ తేజ్, లావణ్యల నిశ్చితార్ధం రేపు ఘనంగా జరగబోతోంది. ఈ నేపథ్యంలో లావణ్యకు సంబంధించిన పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరిద్దరూ జంటగా నటించిన అంతరిక్షం సినిమా ప్రమోషన్స్ సమయంలో లావణ్యను యాంకర్ మీ హజ్బెండ్ మెటీరియల్ ఎవరు అని అడిగింది. ఇందుకు లావణ్య స్పందిస్తూ.. హజ్బెండ్ మెటీరియల్ అంటే తేజ్. తేజ్ పుట్టిందే భర్త అవ్వడానికి అని చెప్పారు. అప్పుడేదో సరదాగా చెప్పింది అనుకున్నాం కానీ.. మొత్తానికి మెగా ప్రిన్స్‌కు భార్య, మెగా కుటుంబానికి కోడలు అయిపోతోంది ఈ సొట్ట బుగ్గల సుందరి. లావణ్య, వరుణ్ కాంబినేషన్‌లో అంతరిక్షం, మిస్టర్ సినిమాలు వచ్చాయి. వీరిద్దరూ మిస్టర్ సినిమాలో ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత వీరి స్నేహం కాస్తా ప్రేమగా మారిందని తెలుస్తోంది.