Lal Salaam: త‌లైవా.. మొయ్దీన్​ భాయ్​గా​!

Chennai: సూపర్​స్టార్​ రజినీకాంత్(Super star Rajinikanth) కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్(Aishwarya Rajinikanth) దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘లాల్ సలామ్'(Laal Salaam). ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాలో దాదాపు 33 ఏళ్ల తర్వాత ప్రముఖ నటి జీవిత రాజశేఖర్(Jeevitha Rajashekar) ఓ ముఖ్య పాత్రలో ఈ సినిమా ద్వారా వెండితెరపై కనిపించనున్నారు. ఈ సినిమాలో జీవిత, రజినీకాంత్ సోదరిగా నటించనున్నట్టు ఇటీవలే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉండగా ఆమె చివరగా 1990లో మగాడు సినిమాతో ప్రేక్షకులను అలరించగా… మళ్లీ ఇన్నాళ్లకు ఆడియెన్స్ ముందుకు రాబోతుండడం విశేషం.

విష్ణు విశాల్(Vishnu Vishal), విక్రాంత్(Vikranth) హీరోలుగా నటిస్తున్న ‘లాల్ సలామ్’ పీరియాడిక్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది. అయితే, ఈ సినిమాలో మొయ్దీన్ భాయ్(Moideen Bhai) అనే పాత్రలో రజినీకాంత్ నటిస్తున్నాడు. ఈ పాత్ర కోసం ఆయన సరికొత్త గెటప్‌లో కనిపిస్తున్నాడు. ఈ మూవీలోని ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో రజినీకాంత్‌ను మునుపెన్నడూ చూడని విధంగా చూసి అభిమానులు అవాక్కవుతున్నారు.

లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు నిర్మిస్తున్న ‘లాల్ సలామ్’ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు ఈ సినిమా రజినీకాంత్ 170వ చిత్రం కానుండడంతో సినీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే మూవీ టీం.. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించారు. కాగా ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

‘లాల్ సలామ్’ సినిమాలో రజినీకాంత్.. ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇక ప్రస్తుతం నెల్సన్ డైరెక్షన్ లో ‘జైలర్’లో రజినీ కాంత్ నటిస్తున్నారు. గతేడాది ‘అన్నాతే’ చిత్రంతో నిరాశ పరిచిన రజినీ ప్రస్తుతం మూడు చిత్రాలను లైన్ లో పెట్టారు.