Kushi: టైటిల్ సీక్రెట్ ఇదే..!

మహానటి సినిమా తర్వాత రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)తో కలిసి మరోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటోంది స్టార్ హీరోయిన్ సమంత(Samantha). ఖుషి(Kushi) పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. గతంలో మహానటి సినిమాలో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), సమంత కలిసి నటించినప్పటికీ అది పూర్తి స్థాయి పాత్ర కాదు. ఫీల్ గుడ్ ప్రేమకథతో విజయ్‌–సామ్‌ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా గురించి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఖుషి డైరెక్టర్ శివ నిర్వాణ(Shiva Nirvana) పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. దర్శకుడిగా జర్నీ స్టార్ట్ చేసిన ఐదేళ్లలోనే ఇలాంటి మంచి సినిమాకు దర్శకత్వం వహించడం ఆనందంగా ఉందని అన్నాడు. ఖుషి కథ రాయగానే తన మనసులోకి వచ్చిన మొదటి ఆలోచన సమంతనే అని చెప్పారు శివ. ఆమె అయితేనే ఈ పాత్రకు న్యాయం చేయగలదని భావించామని, అలాగే విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) తన పాత్రకు జీవం పోశారని అన్నారు.
షూటింగ్ ప్రారంభించిన తర్వాత సమంత అనారోగ్యం కారణంగా కొన్ని నెలల పాటు వాయిదా వేశామని చెప్పిన శివ నిర్వాణ.. ఖుషి అనే టైటిల్ పెట్టడం వెనుక రీజన్ ఏంటి అనే విషయాన్ని కూడా వెల్లడించాడు. గతంలో పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా ఫీల్ గుడ్ మూవీగా వచ్చి భారీ సక్సెస్ సాధించిందని, ఈ సినిమాలో కూడా అంతే ఫీల్ ఉంది గనుక ఈ సినిమాకు ఖుషి అనే టైటిల్ కన్ఫర్మ్ చేశామని తెలిపారు.
ఇకపోతే ఖుషి సినిమాలో విజయ్ దేవరకొండ ప్రైవేట్ ఉద్యోగిగా, సమంత గృహిణిగా నటిస్తున్నారని శివ చెప్పారు. వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాలో హైలైట్ గా ఉంటుందన్నారు. లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమా కావడం, ఈ సినిమాలో సమంత భాగం కావడంతో ఖుషి సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వైవిద్యభరితమైన కథతో ఈ సినిమా స్క్రిప్ట్ రాసుకున్న శివ నిర్వాణ.. యూత్ ఆడియన్స్ కోరుకునే విధంగా ఖుషి మూవీ తెరకెక్కిస్తున్నారట.
ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టారట మేకర్స్. అతి త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసి సెప్టెంబర్ 1న ఖుషి చిత్రాన్ని రిలీజ్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు.