Kushi: క్లాస్​ సాంగ్​తో వస్తున్న రౌడీ!

Hyderabad: టాలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay deverakonda) నటిస్తున్న తాజా చిత్రం ఖుషి (Kushi). శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్​కి జోడీగా సమంత (Samantha) నటిస్తోంది. నిన్ను కోరి, మజిలీ సినిమాలతో హిట్లు అందుకున్న శివ దర్శకత్వంలో వస్తున్న ఖుషి నుంచి విడుదలైన పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేస్తూ.. మంచి బజ్‌ క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా మరో అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్‌.

‘ఖుషి నువ్‌ కనబడితే.. ఖుషి నీ మాట వినబడితే..’ అంటూ హేశమ్‌ అబ్ధుల్‌ వహబ్‌ కంపోజిషన్‌లో సాగుతున్న ట్యూన్‌ ఈ సినిమా ఆల్బమ్‌ ఎలా ఉండబోతుందో హింట్ ఇస్తోంది. ఖుషి ఆడియో రైట్స్‌ను సరిగమసౌత్‌ దక్కించుకుంది. హేశమ్‌ అబ్ధుల్‌ వహబ్‌ అద్భుతమైన పాటలు సిద్దం చేశాడని తాజా ట్యూన్‌తో తెలిసిపోతుంది. ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం విజయ్‌, సామ్‌ రొమాంటిక్‌ లవ్‌ అండ్‌ ఫ్యామిలీ జర్నీ నేపథ్యంలో సూపర్ కూల్‌గా సాగబోతున్నట్టు ఇప్పటివరకు విడుదలైన లుక్స్‌ చెబుతున్నాయి.

ఖుషి చిత్రాన్ని సెప్టెంబర్ 1న సినిమా విడుదల చేస్తున్నట్టు తెలియజేస్తూ.. స్పెషల్ పోస్టర్‌ను కూడా లాంఛ్ చేశారు మేకర్స్‌. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోన్న ఈ మూవీలో స‌చిన్ ఖ‌డేక‌ర్‌, ముర‌ళీ శ‌ర్మ‌, ల‌క్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, కన్నడ యాక్టర్‌ జ‌య‌రాం, శ‌ర‌ణ్య ప్రదీప్‌ కీల‌క పాత్రలు పోషిస్తున్నారు.