Guntur Kaaram: నాకు అంత డబ్బు రాలేదు.. ఆ మాటలు నమ్మకండి
Guntur Kaaram: ఆ కుర్చీని మడతపెట్టి దె*** మెడలు విరిగిపోనాయ్ అనే ఒక్క డైలాగ్‌తో తెలుగు రాష్ట్రాల్లో తెగ ఫేమస్ అయిపోయారు ఈ తాత. ఈయన పేరేంటో తెలీదు కానీ చాలా మంది కుర్చీ తాత అని పిలుస్తున్నారు. ఈ డైలాగ్‌ను తమన్ (thaman) గుంటూరు కారంలో ఓ మాస్ పాటకు వాడేసారు. మహేష్ బాబు (mahesh babu) ఆ కుర్చీని మడతపెట్టి అంటూ డైలాగ్ చెప్తూ మాస్ స్టెప్పులతో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేసారు.
అయితే ఈ డైలాగ్ వాడుకునేందుకు తమన్ కుర్చీ తాతను కలిసి ఆర్థిక సాయం చేసారు. అయితే ఎంత సాయం చేసారు అని అడగ్గా రూ.5000 అని ఓ సందర్భంలో తాత చెప్పారు. మరీ రూ.5000 ఏంటా అని అనుకుంటుండగా ఇంకో ఇంటర్వ్యూలో రూ.1 లక్ష వరకు ఇచ్చారని చెప్పారు. దాంతో తాత అబద్ధాలు ఆడుతూ ఎక్కువ డబ్బులు గుంజాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో కుర్చీ తాత తనకు వచ్చిన రెమ్యునరేషన్ గురించి చెప్తూ ఓ వీడియో రిలీజ్ చేసారు. తనకు రూ.5000 మాత్రమే ఇచ్చారనేది అబద్ధమని లక్ష వరకు ఇచ్చారని ఆ డబ్బును భవిష్యత్తులో ఉపయోగించుకునేందుకు చిట్టీ కట్టుకున్నానని తెలిపారు. తన గురించి తప్పుగా రాయొద్దని వేడుకున్నారు. కుర్చీ మడతపెట్టి పాటలో తాతను కూడా చూపించాలనుకున్నారు గుంటూరు కారం టీం. కానీ ఈ పాట షూటింగ్ వరంగల్‌లో జరగడం వల్ల తాత గోల్డెన్ ఛాన్స్ మిస్సయ్యారు. ముందు ముందు తీయబోయే సినిమాల్లో తప్పకుండా అవకాశం ఇస్తామని టీం మాటిచ్చింది.