Hari Hara Veera Mallu: త‌ప్పుకోలేదు.. త‌ప్పులుంటే చెప్తారు

krish is supervising Hari Hara Veera Mallu

Hari Hara Veera Mallu: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) న‌టిస్తున్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా నుంచి ద‌ర్శ‌కుడు క్రిష్ జాగ‌ర్ల‌మూడి (Krish Jagarlamudi) త‌ప్పుకున్నార‌న్న టాక్ న‌డుస్తోంది. ఎందుకంటే ఇటీవ‌ల రిలీజ్ అయిన హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు పోస్ట‌ర్‌పై ద‌ర్శ‌కుడి పేరు క్రిష్ అని కాకుండా జ్యోతి కృష్ణ అని ప్రింట్ చేయించారు. దాంతో క్రిష్ మ‌ళ్లీ సినిమా నుంచి త‌ప్పుకున్నారేమో అనే సందేహం మొద‌లైంది. అయితే నిజానికి క్రిష్ ఈ సినిమా నుంచి త‌ప్పుకోలేదు.

జ్యోతి కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు కానీ క్రిష్ దగ్గ‌రుండి ప‌ర్య‌వేక్షిస్తుంటారు. ఏమ‌న్నా త‌ప్పులు వంటివి ఉంటే స‌రిదిద్దేందుకు మాత్ర‌మే క్రిష్ సెట్స్‌కి వ‌స్తార‌ట‌. ఇలా ఓ స్టార్ న‌టుడి సినిమా నుంచి త‌ప్పుకోవ‌డం క్రిష్‌కి కొత్తేం కాదు. గ‌తంలో ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు, మ‌హానాయకుడు సినిమాలు కూడా క్రిషే తీయాల్సి ఉంది. కానీ ఎక్క‌డ సినిమాలో తేడా వ‌స్తే నంద‌మూరి బాల‌కృష్ణ‌, అభిమానులు ట్రోల్ చేస్తారో అని భ‌య‌ప‌డి ఆయ‌న సినిమా నుంచి త‌ప్పుకున్నారు. ఇప్పుడు ప‌వ‌న్ రాజ‌కీయాల్లో ఉన్న నేప‌థ్యంలో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా విష‌యంలోనూ అంతే అంచ‌నాలు ఉన్నాయి. సినిమా బాలేక‌పోతే ప‌వ‌న్ ఫ్యాన్స్ ఎక్క‌డ తిడ‌తారో అని భ‌య‌ప‌డి ఆయ‌న తెలివిగా ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకున్న‌ట్లు తెలుస్తోంది.