Koratala Siva: తార‌క్‌కు కొత్త టెన్ష‌న్..!

Koratala Siva: ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌.. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను (jr ntr) మ‌ళ్లీ టెన్ష‌న్ పెడుతున్నారు. గ‌తంలో కొర‌టాల ఆచార్య (acharya) సినిమా తీస్తున్న‌ప్పుడే ఎన్టీఆర్‌తో దేవ‌ర సినిమాను ఓకే చేయించారు. అయితే అనుకున్న స‌మ‌యానికి షూటింగ్ మొద‌లుకాక‌పోవ‌డంతో తార‌క్ కాస్త టెన్ష‌న్‌కు గుర‌య్యారు. ఒకానొక స‌మ‌యంలో అస‌లు సినిమా పట్టాలెక్కుతుందో లేదో కూడా తెలిసేది కాదు. (koratala siva)

ఇప్పుడు ఏమైంది?

ఇప్పుడు కొర‌టాల వివాదంలో ప‌డ్డారు. మహేష్ బాబుతో (mahesh babu) ఆయ‌న తీసిన శ్రీమంతుడు (srimanthudu) సినిమా తాను ఒక‌ప్పుడు స్వాతి పుస్త‌కంలో రాసిన క‌థేన‌ని ర‌చ‌యిత శ‌ర‌త్ చంద్ర నాంప‌ల్లి కోర్టును ఆశ్ర‌యించారు. తీర్పు కొర‌టాల‌కు వ్య‌తిరేకంగా రావ‌డంతో ఆయ‌న సుప్రీంకోర్టు మెట్లెక్కారు. అక్క‌డ కూడా కొర‌టాల‌కు చుక్కెదురైంది.

దీని వ‌ల్ల కొర‌టాల దేవ‌ర‌పై ఫోకస్ చేయ‌లేక‌పోతున్నారు. ఇప్ప‌టికే దేవ‌ర సినిమాలో న‌టిస్తున్న సైఫ్ అలీ ఖాన్‌కు (saif ali khan) స‌ర్జ‌రీ అవ్వ‌డంతో సినిమా ఏప్రిల్‌లో రిలీజ్ అయ్యే ప‌రిస్థితుల్లో లేదు. మ‌రోప‌క్క కొర‌టాల చుట్టూ ఉన్న వివాదం ఎక్క‌డ ఈ సినిమాపై ప్ర‌భావం చూపుతుందో అనే టెన్ష‌న్ కూడా ఉంది.