Kiran Abbavaram: పెళ్లి పీటలెక్కనున్న కిరణ్.. అమ్మాయి ఎవరో తెలుసా?
Kiran Abbavaram: యువ నటుడు కిరణ్ అబ్బవరం పెళ్లి పీటలెక్కనున్నారు. రహస్య గోరక్ (Rahasya Gorak) అనే యువతితో కిరణ్ నిశ్చితార్ధం బుధవారం జరగనుంది. రహస్యా గోరక్ ఎవరో కాదు. కిరణ్ నటించిన తొలి చిత్రం రాణావారు రాణివారులో హీరోయిన్‌గా నటించిన అమ్మాయే. తొలి సినిమాతోనే వీరిద్దరి మధ్య స్నేహం చిగురించి అది కాస్తా ప్రేమగా మారింది. గతేడాది కిరణ్ అబ్బవరం నివాసంలో గృహప్రవేశం కార్యక్రమం ఉన్నప్పుడు అక్కడ రహస్యా గోరక్ కూడా కనిపించారు. అప్పుడే వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందన్న టాక్ మొదలైంది. మొత్తానికి బుధవారం వీరి నిశ్చితార్ధం ఘనంగా జరగనుంది.